Home క్రీడాప్రభ Jr.Asia Cup Hockey | ఫైనల్స్‌కు యువ భారత్..

Jr.Asia Cup Hockey | ఫైనల్స్‌కు యువ భారత్..

0
Jr.Asia Cup Hockey | ఫైనల్స్‌కు యువ భారత్..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మహిళల జూనియన్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నీ ఫైనల్లో దూసుకెళ్లింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు కనబర్చుతున్న టీమిండియా నాకౌట్‌లోనూ అదరగొట్టింది. శనివారం జరిగిన తొలి సెమీస్‌లో భారత్‌ 3-1 గోల్స్‌ తేడాతో జపాన్‌ను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచే చెలరేగి ఆడిన భారత ప్లేయర్లు 4వ నమిషంలోనే బోణీ చేశారు. ముంతాజ్‌ ఖాన్‌ నాలుగో నిమిషంలోనే కళ్లు చెదిరే గోల్‌ సాధించింది. ఆ వెంటనే 5వ నిమిషంలో సాక్షి రాణా రెండో గోల్‌ చేసి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన భారత అమ్మాయిలు హ్యాట్రిక్‌ సాధించారు. 13వ నిమిషంలో దీపిక భారత్‌కు మూడో గోల్‌ అందించడంతో భారత్‌ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అనంతరం గోల్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన జపాన్‌ చివరికి 23వ నిమిషంలో తొలి గోల్‌ నమోదు చేసింది. నికో మరుయుమా జపాల్‌ తరఫున మొదటి గోల్‌ నమోదు చేసింది. తర్వాత మ్యాచ్‌ పూర్తి సమయం ముగిసే వరకు మరో గోల్‌ నమోదు కాలేక పోవడంతో భారత్‌ 3-1తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

మరో సెమీస్‌లో చైనా 2-0 తేడాతో కొరియాపై గెలిచి ఫైనల్లో ప్రవేశించింది. దీంతో రేపు జరిగే టైటిల్‌ పోరులో భారత్‌-చైనా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Exit mobile version