ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఔట్‌డోర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన 94ఏళ్ల భగ్వానీ దేవీ డాగర్ అదరగొట్టంది. 100మీటర్లు పరుగు పందెంలో పాల్గొన్ని బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. 24.74 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ సాధించింది. అంతేగాకుండా షాట్‌పుట్‌లోనూ సత్తా చాటి కాంస్యం పతకాన్ని అందుకుంది. ఈ విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఏదైనా సాధించాలనుకుంటే.. వయసుతో సంబంధం లేదని 94ఏళ్ల భగ్వానీ దేవీ నిరూపించింది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అంతకుముందు ఈ వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించేందుకు చెన్నై వేదికగా జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొని మూడు స్వర్ణాలు సాధించి రికార్డుకెక్కిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.