Sunday, November 24, 2024

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు.. 32 ఏళ్లలో ఇదే తొలిసారి

టెస్టు క్రికెట్‌ను బ్రతికించేందుకు బారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో 5 మ్యాచ్‌లను నిర్వహించేందుకు రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు అంగీకరించాయి. దాంతో 32 ఏళ్ల తర్వాత టీమిండియా-ఆసీస్‌ జట్లు తొలిసారి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనున్నాయి. చివరిసారి 1991-92లో ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల (బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ) సిరీస్‌ ఆడాయి.

కాగ, గత కొంత కాలంగా టెస్టు క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లండ్‌ జట్టు బజ్‌బాల్‌ ఆటతో సుదీర్ఘ ఫార్మాట్‌ గితినే మార్చేయగా.. మరోవైపు బీసీసీఐ సైతం టెస్టు క్రికెట్‌కు ఆధారణ పెంచేందుకు టెస్టులు ఆడే క్రికెటర్ల ఫీజును భారీగా పెంచేసింది. ఇక ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆసీస్‌ పర్యటనలో ఇరుజట్లు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ను ఆడుతాయి. సిడ్నీ వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement