Saturday, January 4, 2025

4th Test | భారత్ ఘోర పరాజయం

బాక్సింగ్ డే లో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 369, రెండో ఇన్నింగ్స్ లో 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 184 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది.

4వ టెస్ట్‌ను డ్రా చేసుకునేందుకు భారత ఆటగాళ్లు ప్రయత్నించగా.. విజయం కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు శ్రమించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ భారత్ జట్టు ఓడిపోవడంతో ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో ఆసీస్ ముందంజలో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement