Saturday, December 28, 2024

4th Test : కష్టాల్లో భారత్…

మెల్‌బోర్న్ టెస్టు రెండో రోజు మూడ‌వ సెష‌న్‌లో అనూహ్య ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. ఆఖ‌రి క్ష‌ణాల్లో వ‌రుస‌గా ఇండియా మూడు వికెట్ల‌ను కోల్పోయింది. హాఫ్ సెంచ‌రీ చేసిన జైస్వాల్ ర‌నౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత బోలాండ్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 153 ర‌న్స్‌కు రెండు వికెట్లు కోల్పోయి.. స్థిరంగా ఆడుతున్న‌ట్లు క‌నిపించిన ఇండియా అక‌స్మాత్తుగా మ‌రో రెండు వికెట్ల‌ను చేజార్చుకున్న‌ది. నైట్‌వాచ్‌మెన్‌గా వ‌చ్చిన ఆకాశ్ దీప్ కూడా పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. 13 బంతులు ఆడిన అత‌ను డ‌కౌట్ అయ్యాడు. ప్ర‌స్తుతం పంత్‌, జ‌డేజా క్రీజ్‌లో ఉన్నారు.

మూడ‌వ వికెట్‌కు కోహ్లీ, జైస్వాల్ మ‌ధ్య 102 ప‌రుగుల భాగ‌స్వామ్యం ఏర్ప‌డింది. జైస్వాల్ ర‌నౌట్ అయిన కొన్ని బంతుల తేడాలోనే కోహ్లీ ఔట‌య్యాడు. జైస్వాల్ 82, కోహ్లీ 36 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించారు. నైట్‌వాచ్‌మెన్ ఆకాశ్ దీప్ డ‌కౌట్ అయ్యాడు. బోలాండ్ అత‌న్ని ఔట్ చేశాడు. టీ బ్రేక్‌కు ముందు రాహుల్‌, రోహిత్ ఔట‌య్యారు. ఆస్ట్రేలియా త‌న ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 474 ర‌న్స్ స్కోర్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి.. ఇండియా 5 వికెట్ల న‌ష్టానికి 164 ర‌న్స్ చేసింది. పంత్ 6, జ‌డేజా 4 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

- Advertisement -

మన్మోహన్‌ సింగ్ కు టీమిండియా ఘ‌న నివాళి..
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టు సైతం మన్మోహన్‌కు నివాళులర్పించింది. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా మెల్‌బోర్న్‌ బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమ్‌ ఇండియా ఆటగాళ్లంతా చేతికి నల్లబ్యాండ్‌లు ధరించి సంతాపం తెలిపి బరిలోకి దిగారు. ఈ మేరకు ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో ఉన్న ఫొటోలను బీసీసీఐ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement