Monday, September 9, 2024

ACA | 405 రన్స్.. ఏసీఏ చరిత్రలో ఆల్ టైం రికార్డు..

(ప్రభ న్యూస్, ఇబ్రహీంపట్నం) : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో రికార్డు సృష్టించింది. మూలపాడులో జ‌రుగుతున్న‌ సీనియర్ అంత‌ర్ జిల్లాల మ్యాచ్‌లో కేడీసీఏ ప్లేయర్ వై.సందీప్ రికార్డు స్థాయిలో 405 పరుగులు చేశాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. దీంతో ఈ రికార్డు సాధించిన సందీప్‌ను కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ శనివారం ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), నర్సాపురం మాజీ ఎంపీ, ఆంధ్రా క్రికెట్‌ సంఘం మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ.రాజేష్‌, ఏసీఏ మాజీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ వి.దుర్గాప్రసాద్‌, కేడీసీఏ కార్యదర్శి రవీంద్రచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement