Tuesday, December 17, 2024

IND vs BAN T20I | రేపు బంగ్లాతో రెండో టీ20… సిరీసే ల‌క్ష్యంగా బరిలోకి భార‌త్ !

బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. సీనియర్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. సంచలన జట్టు బంగ్లాపై ఆల్‌రౌండ్‌ షోతో భారీ విజయాన్ని నమోదు చేశారు. గ్వాలియర్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సూర్యకుమార్‌ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనే అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.

రేపు ఢిల్లిలోని అరుణ్‌ జైట్లి క్రికెట్‌ స్టేడియం వేదికగా భారత్ – బంగ్లాదేశ్‌ మధ్య రెండో టీ20 జరగనుంది. కాగా, మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. మరోవైపు బంగ్లాదేశ్‌ గత మ్యాచ్‌ తప్పిదాలతో గుణపాఠులు నేర్చుకుని ఢిల్లి మ్యాచ్‌కు సిద్ధమైంది. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాను ఓడించి సిరీస్‌ను కూడా చేజారకుండా కాపాడుకోవాలని చూస్తోంది.

తుది జట్ల వివరాలు: (అంచనా)

భారత్‌: సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), నితీష్‌ కుమార్‌ రెడ్డి/తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, రియాన్‌ పరాగ్‌, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి.

బంగ్లాదేశ్‌: పర్వేజ్‌ హొస్సేన్‌/తన్జీత్‌ హసన్‌, లిటన్‌ దాస్‌ (వికెట్‌ కీపర్‌), నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (కెప్టెన్‌), తౌహిత్‌ హ్రిదయ్‌, మొహ్మదుల్లా, జాకెర్‌ అలీ, మెహదీ హసన్‌ మిరాజ్‌, రిషాద్‌ హొస్సేన్‌, తస్కీన్‌ అహ్మద్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ అహ్మద్‌.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement