చుక్కలు… ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి విజయం కోల్కతా వైపు నిలిచింది. కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ కాస్త గట్టిగానే పోరాడింది.
ఎంత ఆడిన రోజు మంది కానప్పుడు చివరి 5 బంతుల్లోనే మ్యాచ్ గమనం మారిపోయి విజయం కోల్కతాకు వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు చివరి వరకు చుక్కలు చూపించారు.
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఆసీస్ స్టార్ పేసర్, కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు బంబేలెత్తించారు. అతడిని టార్గెట్ చేసినట్లుగా ఓ ఆట ఆడేసుకున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు. ఈయనను ఐపీఎల్-2024 మినీ వేలంలో ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోలక్కతా సొంతం చేసుకుంది.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ తన 4 ఓవర్లు బౌలింగ్ వేయగా.. 53 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ ను అందిచలేకపోయాడు. టీం మొత్తం బౌలర్స్ లో అత్యధిక ఎకానమీ రేట్ ను మిచెల్ స్టార్క్ ప్రదర్శనకే కలంకం తెచ్చేలా ఉంది.