Saturday, November 23, 2024

2026 కామన్‌వెల్త్‌ క్రీడలు రద్దు.. బడ్జెట్ కార‌ణాల‌తో ఆస్ట్రేలియా వెన‌క‌డుగు

ఆస్ట్రేలియాలో 2026లో జరగాల్సిన కామన్‌వెల్త్‌ క్రీడలు రద్దయ్యాయి. క్రీడలను నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్రం వెనుకడుగు వేసింది. బడ్జెట్‌ కారణాల వల్ల కామన్‌వెల్త్‌ క్రీడల్ని నిర్వహించలేకపోతున్నట్లు చెప్పింది. దీంతో ఆ గేమ్స్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొన్నది. క్రీడా పోటీల నిర్వహణకు మరొక అతిథి నగరాన్ని గుర్తించలేకపోయినట్లు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పేర్కొన్నది. క్రీడల ఏర్పాట్ల కోసం చేసిన అంచనా వ్యయం మూడింతలు పెరిగిందని విక్టోరియా ప్రీమియర్‌ డానియల్‌ ఆండ్రూస్‌ తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుత్సాహపరిచినట్లు సీజీఎఫ్‌ పేర్కొన్నది. దీనికి త్వరలో పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు వెల్లడించింది.

కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణకు తొలుత 2 బిలియన్ల డాలర్లు అవుతుందని విక్టోరియా ప్రభుత్వం భావించింది. కానీ ఈమొత్తం 7 బిలియన్ల డాలర్లకు చేరుతుందన్న అంచనాతో వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. గతంలోనూ రెండుసార్లు ఈ గేమ్స్‌ రద్దయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం 2 కారణంగా, 1942,1946 ఎడిషన్‌లు నిర్వహించలేదు. కామన్వెల్త్‌ గేమ్స్‌ అనేది కామన్వెల్త్‌ కూటమిలోని 56 దేశాల క్రీడాకారులు పాల్గొనే వేదిక. ఇది నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా టోర్నమెంట్‌. గతంలో ఆస్ట్రేలియా (1938, 1962, 1982, 2006, 2018) ఐదుసార్లు ఆతిథ్యం ఇచ్చింది

Advertisement

తాజా వార్తలు

Advertisement