సఫారీలతో మూడు వన్డెల సిరీస్ కోసం శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ ముందుకొచ్చింది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్‌లను ధావన్ నేతృత్వంలో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. గత రెండేళ్ల నుంచి వన్డే ఫార్మట్‌లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ శిఖర్ ధావన్ కావడం విశేసం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఫిట్‌గా తయారు కావడంపైనే దృష్టి సారించినట్లు ధావన్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం నేపథ్యంలో శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు.
”నా కెరీర్ చాలా బాగా సాగుతోంది. అందుకు కృతజ్ఞుడిని. నా అనుభవం, నాలెడ్జెను యువ ఆటగాళ్లకు చెప్పేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటా. ఇప్పుడు నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి. ఇదొక అవకాశం తీసుకొని సవాళ్లను ఎదుర్కొంటా.
అలాగే ఆటను ఆస్వాదిస్తా. అయితే నా లక్ష్యం మాత్రమే 2023 వన్డే ప్రపంచకప్. దాని కోసం నేను ఫిట్‌గా ఉండటంతో పాటు నా మనస్సును మంచి స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా” అని ధావన్ వెల్లడించాడు.