Friday, November 22, 2024

1983 వరల్డ్ కప్ హీరో యశ్ ‌పాల్ శర్మ కన్నుమూత.. రాష్ట్రపతి నివాళులు

మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. పంజాబ్‌కు చెందిన ఆయన కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. 1972లో పంజాబ్, జమ్మూకాశ్మీర్ స్కూళ్ల మధ్య జరిగిన క్రికెట్‌లో 260 పరుగులు చేసి ఆయన అందరి దృష్టిలో పడ్డారు. 1978లో వన్డే జట్టులోకి, 1979లో టెస్టు జట్టులోకి వచ్చిన యశ్‌పాల్.. 1985లో అంతర్జాతీయ క్రికెట్‌కు యశ్ పాల్ శర్మ వీడ్కోలు పలికారు.

కాగా య‌శ్‌పాల్ మృతి బాధాక‌రం అని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. 83 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అతడి ప్ర‌ద‌ర్శ‌న అసాధార‌ణ‌మ‌న్నారు. య‌శ్‌పాల్ కుటుంబ‌స‌భ్యుల‌కు రాష్ట్రపతి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు య‌శ్‌పాల్ మృతి ప‌ట్ల మాజీ క్రికెట‌ర్లు సంతాపం తెలిపారు. య‌శ్‌పాల్ మృతి ఎంతో షాక్‌కు గురి చేసింద‌ని స‌చిన్ టెండూల్క‌ర్ తెలిపారు. 1983 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత‌ని బ్యాటింగ్ శైలిని చూసి ఎంజాయ్ చేసేవాడిని అని పేర్కొన్నాడు. ఎన్నో జ్ఞాప‌కాలు మిగిలి ఉన్నాయ‌న్నారు. భార‌తీయ క్రికెట్‌కు ఆయ‌న అందించిన భాగ‌స్వామ్యం మ‌ర‌వ‌లేనిదంటూ శ‌ర్మ కుటుంబానికి నివాళి అర్పించారు.

ఈ వార్త కూడా చదవండి: టీ-20 క్రికెట్‌లో క్రిస్ గేల్ అరుదైన రికార్డు

Advertisement

తాజా వార్తలు

Advertisement