ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. అయితే వీటిలో 5పతకాలు సింధు ఖాతాలోనే ఉండటం విశేషం. 1983లో ప్రకాశ్ పదుకొనె కాంస్యపతకం సాధించి బోణీ కొట్టాడు. అనంతరం 2011లో గుత్తాజాల-అశిని జోడీ కాంస్యం సాధించారు. 2013లో పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో తన పతకాల ఖాతా తెరిచింది. ఆ తర్వాత 2014లోనూ సింధు కాంస్యం కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2015లో సైనా నెహ్వాల్ రజతం సాధించి సత్తా చాటింది. అయితే 2017లో భారత షట్లర్లు డబుల్ బొనంజా రెండు పతకాలు సాధించి చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు. తెలుగుతేజాలు పీవీ సింధు రజతపతకం సాధిస్తే.. సైనా నెహాల్ కాంస్యం కైవసం చేసుకుంది. 2018లో పీవీ సింధు మరోసారి వెండిపతకంతో మెరిసింది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణపతకం కైవసం చేసుకుని కొత్త చరిత్రకు నాంది పలికింది.
ఇదే ఏడాది సాయిప్రణీత్ కూడా కాంస్యం సాధించడంతో భారత్ ఖాతాలో మరోసారి రెండు పతకాలు చేరాయి. కాగా 2017లో తొలిసారి భారత షట్లర్లు 2పతకాలు సాధించారు. సింధు రజతం, సైనా కాంస్యం అందించారు. అనంతరం 2019లో మరోసారి భారత షట్లర్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2పతకాలు సాధించి సత్తా చాటారు. సింధు స్వర్ణం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తే..సాయిప్రణీత్ కాంస్యం అందించాడు. తాజాగా 2021లో శ్రీకాంత్ సిల్వర్ మెడల్ అందించగా లక్ష్యసేన్ కాంస్య పతకాన్ని అందించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత పురుష షట్లర్లు ఒకేసారి రెండు పతకాలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. డబుల్ ఒలింపిక్ విజేత, హైదరాబాదీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో భారత షట్లర్లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital