ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. సన్‌రైజర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు విజేత ఎవరో తేలలేదు. అయితే చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌ను మలుపుతిప్తేశారు. చివరి ఓవర్లో 16 పరుగుల కావల్సి ఉండగా.. 9 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది. దీంతో విజయం ఆర్సీబీ ని వరించింది.
నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో షహబాజ్ నదీమ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు, కైల్ జేమీసన్‌కు 1 వికెట్ దక్కింది. ఆర్సీబీ విజయంలో 17వ ఓవర్ వేసిన షెహబాజ్ అహ్మద్.. అద్భుత ఓవర్‌తో 3 వికెట్లు తీసి సన్‌రైజర్స్ వెన్ను విరిచాడు. 20 ఓవర్లకు బెంగళూరు 149 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 13 పరుగులొచ్చాయి. మ్యాక్స్ వెల్ ( 59) సిక్సర్ బాది అర్ధశతకం బాదాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక పాయింట్ల పట్టికలో 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో టాప్ ప్లేస్‌కు చేరింది బెంగళూరు.