భారతతో జరిగిన టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండు కోల్పోవడానికి ఆ జట్టు రొటేషన్ పాలసీ కారణం అన్నాడు ఇంగ్లీష్ మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్. రెండో టెస్టు అనంతరం రొటేషన్ విధానంతో మోయిన్ అలీ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడని కానీ మిగిలిన రెండు టెస్టులకు అలీని ఆడించాలని ఈసీబీ భావించిందని అన్నాడు. బెయిర్ స్టో విషయంలోనూ ఇలానే జరిగిందన్నాడు. లంక సిరీస్ లో అద్భుతంగా రాణించిన బెయిర్ స్టో టీమిండియా సిరీస్ లో మాత్రం విఫలమయ్యాడు. కొన్నిసార్లు రొటేషన్ పాలసీ అద్భుతంగా పని చేసిన ఈ సారి మాత్రం తమకు చేదు అనుభవాలను మిగిల్చిందని నాసిర్ హుస్సేన్ అన్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement