Tuesday, November 26, 2024

ఇంగ్లాండ్‌కు చుక్కెదురు..యూరో కప్ విజేత ఇటలీ..

యూరో 2020 ఫుట్‌బాల్ క‌ప్ ఫైనల్లో ఇటలీ విజేతగా నిలిచింది. తుదిపోరు ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి.. అయితే పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై ఇట‌లీ విజ‌యం సాధించింది. యూరో క‌ప్ ఫైన‌ల్స్‌లో ఇంగ్లండ్ ఆట‌గాడు లూక్ షా స్టెక్ అతివేగంగా గోల్ చేశాడు. ఆట ప్రారంభ‌మైన 2వ నిమిషంలోనే లూక్ గోల్ చేశాడు. 67వ నిమిషంలో ఇట‌లీ గోల్ చేసి.. 1-1గా స‌మం చేసింది. 90 నిమిషాల ఆట వ్య‌వ‌ధిలో ఇట‌లీ, ఇంగ్లండ్ జ‌ట్లు 1-1 స్కోర్ చేశాయి. పెనాల్టీ షూటౌట్‌లో ఇట‌లీ 3 గోల్స్ చేసి విజేత‌గా నిలిచింది.

తొలిసారి 1968లో యూరో కప్‌లో విజేతగా ఇట‌లీ నిలిచింది. 2000, 2012లో ఇటలీ జట్టు ఫైనల్‌ చేరినా.. ఫైనల్ పోరులో నెగ్గ‌లేక‌పోయింది. 2018 ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఆ కసితో తరువాత ఆడిన మ్యాచుల్లో అపజయమే లేకుండా దూసుకెళ్లింది. 33 మ్యాచ్‌ల్లో ఇటలీ వరుసగా గెలుస్తూ వ‌చ్చింది. ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్ పై ఇటలీదే పైచేయిగా నిలిచింది. ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ వ‌చ్చింది. మొత్తంగా ఫైన‌ల్ మ్యాచులోనూ విజయం సాధించి, రెండవ సారి యూరోకప్‌ను ముద్దాడింది. ఇంగ్లండ్, ఇటలీ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ‌గా.. ఇటలీ 11, ఇంగ్లాండ్‌ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఇక 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్‌.. వరుస విజయాలతో జోరుమీదున్నప్ప‌టికీ.. ఇటలీతో తుదిపోరులో ఓడిపోయింది. మొట్టమొదటి యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఇంగ్లిష్‌ జట్టు పోరాడిన‌ప్ప‌టికీ.. ఈ టోర్నీలో రెండోసారి విజయదుందుభి మోగించింది ఇట‌లీ జ‌ట్టు.

ఇది కూడా చదవండి: జకోవిచ్ ఖాతాలో 20వ గ్రాండ్‌స్లామ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement