Friday, November 22, 2024

అఫ్గాన్‌ జట్టులో అద్భుత బౌలర్లు


న్యూఢిల్లి: టీ20 ఫార్మాట్‌లో ఏ ఒక్క జట్టును ఫేవరెట్‌ అని ఖచ్చితంగా చెప్పలేం. ఓ మంచి ఓవర్‌ బాగా బ్యాటింగ్‌ చేసినా లేదా ఓ ఓవర్‌ బాగా బౌలింగ్‌ చేసినా మ్యాచ్‌ స్వరూ పం మారిపోయి ఆయా జట్ల రాత మారిపో తుంది. పొట్టి ఫార్మాట్‌లో నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు టీ20లీగ్‌ల్లో కొన్ని సంవత్స రాలుగా అఫ్గాన్‌ క్రికెటర్లు ఆడుతున్నారు. అనుభవంతోపాటు ఆత్మవిశ్వాసం మెండు గా ఉన్న ఆటగాళ్లు అఎn్గాన్‌ జట్టులో ఉన్నారు. వారు ప్రత్యర్థులను ఏ రోజైనా కలవర పరచగలరు. అఫ్గాన్‌నిస్థాన్‌ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అల్ట్రా షార్ట్‌ ఫార్మాట్‌లో వారు రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసినా రెండు వికెట్లు పడగొట్టగలరు. పరుగుల రాకుండా అడ్డుకోగలరు. డాట్‌ బాల్స్‌ ఆటను చాలా వేగంగా మలుపు తిప్పగలవు. అఎn్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు రషీద్‌ఖాన్‌ గొప్ప బహుమతి అనవచ్చు.. అతడు ఏ జట్టుకు ఆడతాడో ఆ జట్టు విజయం కోసం పూర్తి నిబద్ధతతో శాయశక్తులా కృషి చేస్తాడు. వేగవంతమైన లెగ్‌ స్పిన్‌ అతడి బలం. లోయర్‌ ఆర్డర్‌లో దిగి బ్యాటింగ్‌లో మెరవడంతోపాటు ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు అతడు చేసే ప్రయత్నాలు ప్రతి కెప్టెన్‌ ఇష్టపడే ఆటగాడిగా రషీద్‌ను మార్చాయి. దానికితోడు ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఆటను ఆస్వాదిస్తాడు. అఫ్గనిస్థాన్‌ క్రికెటర్లలో ధోనీ ఇష్టపడే ఆటగా డు మహమ్మద్‌ నబీ ఒకడు..నబీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూల్‌గా ఉంటాడు. బంతితోపాటు బ్యాట్‌తోనూ నబీ రాణించగలడు. ఇతర ఆఫ్గన్‌ ఆటగాళ్ల గురించి పెద్దగా తెలియదు కానీ ఈ ప్రపంచకప్‌ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా పలు టీ20లీగ్‌ల్లో చాలామంది అఎn్గాన్‌ క్రికెటర్లు కనిపించే అవకాశం ఉంది. వారిని తక్కువగా అంచనావేసే ఏ జట్టయినా ఇబ్బందుల్లో పడుతుంది. కాగా టోర్నీలో సూపర్‌-12కు అర్హత సాధించడం ద్వారా స్కాట్లాండ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టు కుంది. పొట్టి ఫార్మాట్‌లో వారు కూడా అద్భుతాలను సృష్టించవచ్చు. వారి దేశవాళీ క్రికెట్‌లో నాణ్యమైన స్పిన్‌ను ఆడలేకపోవడం ప్రధాన లోపం. స్కాట్లాండ్‌ రాణిస్తే క్రికెట్‌ అభివృద్ధికి దోహదపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement