భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మార్చి 2 ఎంతో మరపురాని రోజు. ఎందుకంటే అతడి కెప్టెన్సీలో అండర్-19 టీమ్ ప్రపంచకప్ సాధించింది ఈరోజే. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తుచేసింది. 2008 మార్చి 2న మలేషియా వేదికగా జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పడు ప్రపంచకప్ సాధించిన అండర్-19 క్రికెట్ టీమ్‌లో విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), సిద్ధార్థ్ కౌల్, మనీష్ పాండే, తన్మయ్ శ్రీవాస్తవ, సౌరభ్ తివారీ కూడా ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement