ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడమే తమ లక్ష్యమన్నారు టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అంజిక్య రహానే. రెపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రహానే ఈ విధంగా మాట్లాడారు. తాము నాలుగో టెస్ట్ గెలవడంతో పాటు ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేసర్ ఇషాంత్ శర్మ మాటలను గుర్తు చేశాడు. ఇక మూడో టెస్ట్ లో పిచ్‌పై వచ్చిన విమర్శలను రహానే కొట్టిపారేసాడు. చివరి టెస్టుకు కూడా పిచ్ అలాగే ఉంటుందన్నాడు. అందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే రేపటి నుంచి జరిగే చివరి టెస్ట్ లో విజయం అయిన సాధించాలి లేదా డ్రా అయిన చేసుకోవాలి..కాని ఓడిపోకూడదు. ఒకవేళ టీమిండియా చివరి మ్యాచ్‌లో ఓడిపోతే ఆసీస్ ఫైనల్‌కు వెళ్తుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసునుంచి నిష్క్‌మ్రించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement