Monday, December 23, 2024

అయ్యో.. సుందర్ సెంచరీ మిస్..

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు భారత్ ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ అవకాశాన్ని తృటిలో మిస్సయ్యాడు. 365 పరుగుల వద్ద అక్షర్ పటేల్ 43 పరుగులకు రనౌట్ కావడంతో సుందర్ కల చెదిరింది. అదే స్కోరు వద్ద ఇషాంత్, సిరాజ్ కూడా స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యారు. దీంతో టీమిండియాకు 160 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. 8వ వికెట్‌కు సుందర్-అక్షర్ పటేల్ 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 101, రోహిత్ 49 పరుగులు చేయగా ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4 వికెట్లు, అండర్సన్ 3 వికెట్లు, లీచ్ 2 వికెట్లు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement