స్పోర్ట్స్ మీట్ ప్రారంభం…

స్పోర్ట్స్ మీట్ ప్రారంభం…

అచ్చంపేట, ఆంధ్రప్రభ : క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(Dr. Rikudu Vamsi Krishna) అన్నారు. ఈ రోజు నాడు అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాలలో జోన్–7 ఆధ్వర్యంలో జరిగిన 11వ జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్(11th Zonal Level Sports Meet) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా విలువలు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారని. ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నదని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జోనల్ ఆఫీసర్, డి.ఎస్.పి పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, గురుకుల పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply