అంకిరెడ్డిగూడెంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ
1,427 మంది ఓటర్లలో 94 అనర్హ ఓట్ల తొలగింపు
1,333కి చేరిన ఓటర్ల సంఖ్య.. వివరాల సవరణకు 274 మంది దరఖాస్తు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్.సూరయ్య ఆధ్వర్యంలో, సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్ సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,427 మంది ఓటర్లు ఉండగా.. అర్హత లేని 94 ఓట్లను తొలగించారు. దీంతో ప్రస్తుతం గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,333కి చేరినట్లు అధికారులు తెలిపారు.
అలాగే 274 మంది ఓటర్లు తమ వివరాల సవరణ కోసం బీఎల్వో సూచించిన మేరకు తగిన ఆధార పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారి వినయ్, బీఎల్వో బొల్లు అండాలు, అంగన్వాడీ టీచర్ నల్ల జయప్రదతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
