Special Pujas | అభ్యర్థుల గెలుపు కోసం పూజలు
మంత్రి సీతక్క గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
Special Pujas | కొత్తగూడ, ఆంధ్రప్రభ : మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సీతక్క గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలకేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ…సర్పంచ్, ఉప సర్పంచ్‌ను నా చేతిలో పెట్టండి. ఎంత మార్పు వస్తదో చూడండి, ఆ తర్వాతనే నాకోసం ఎలక్షన్లకు నేను ఓట్లు అడుగుతానని అన్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో గుర్తుచేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగూడ మండలానికి 500 ఇండ్లు, గంగారం మండలానికి 500 ఇండ్ల తోపాటు రైతు రుణమాఫీ ఇచ్చిందన్నారు. కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంపై దృష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని, మండలకేంద్రం రూపురేఖలు మార్చిన తర్వాతనే నా కోసం నేను ఓట్లు అడుగుతా… మీరందరూ ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండని కోరారు.

