చండూరులో ఘనంగా రజకుల బోనాల పండుగ

  • మడివాల మడేలయ్య, సీతాలమ్మకు ప్రత్యేక పూజలు

చండూర్‌, ఆంధ్రప్రభ : చండూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రజక (చాకలి) సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య, సీతాలమ్మ, శివలింగం, ఈదమ్మ, రేణుక ఎల్లమ్మ, గణపతి, నందీశ్వరులకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం శ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య, సీతాలమ్మల ఎనిమిదో కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మడివాల మడేలయ్య, సీతాలమ్మకు చక్కెర అన్నం, ఈదమ్మకు పసుపు అన్నం, రేణుక ఎల్లమ్మకు బెల్లంతో నైవేద్యాలు సమర్పించి బోనాలు తీశారు.

చండూర్‌ దేవాలయ కమిటీ చైర్మన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భూతరాజు దశరథ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చండూర్‌లోని రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొని డప్పు వాయిద్యాలతో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగిళ్ల శంకర్‌, భూతరాజు దేవదాసు, భూతరాజు నాని, భూతరాజు వెంకన్న, భూతరాజు శేఖర్‌, భూతరాజు పాండు, భూతరాజు శ్రీకాంత్‌, సంగేపు వెంకటేష్‌, సంగేపు మల్లేష్‌, నాగిళ్ల భిక్షం, నాగిళ్ల నరసింహ తదితరులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.