వినాయకుడికి రోజా ప్రత్యేక పూజలు

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి రోజా తన నివాసంలో గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో తన ఇంటి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా తన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. “మా ఇంటి గణపయ్య” అంటూ గణనాథుడిపై తన భక్తిని చాటుకున్నారు.

లోకం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించి.. అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నానని రోజా తెలిపారు. “గణపతి బప్పా మోరియా” అంటూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.