SP | ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ తీసుకోండి..
- ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
SP | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ ను కలిగి ఉండి వాళ్లు ఇచ్చే ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ ని చేసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ సూచించారు. ఈ కవరేజ్ ప్లాన్ లో 11 వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి కడితే మీ ఇద్దరికీ, మీకు ఉన్న ఇద్దరు పిల్లలకి ఈ కవరేజ్ ప్లాన్ చెందుతుందని తెలిపారు.
మీకు అనుకోకుండా ఏమైనా జరిగినా.. మీ పిల్లలకు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా రూ.33లక్షల వరకు కవరేజ్ ప్లాన్ ఉందని, కావున అందరూ గమనించి ఈ ప్లాన్ తీసుకోవాలని జిల్లా హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఇప్పటివరకు నలుగురు హోంగార్డులు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారని వారిని హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ బాండ్లు ఇచ్చి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ జి అనిల్ కుమార్, ఎంటిఓ ఆర్ఐ అండ్ హోంగార్డ్ ఇన్చార్జి రాఘవరావు, ఆర్ఎస్ఐ గౌస్ పాషా, వెంకటనారాయణతో పాటు హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

