సొయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలి
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : సోయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామ రైతులు ఈ రో్జు ఆందోళన చేపట్టారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై హాస కొత్తూరు క్రాసింగ్ రోడ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. మొక్కజొన్న పంట చేతికి వచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ సోయా, మొక్కజొన్న ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ధరలు తగ్గించి రూ.1900 కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రబీ సీజన్లో సన్న బియ్యానికి బోనస్ విడుదల చేయాలని, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర రూ.2,420 చెల్లించాలని డిమాండ్ చేశారు. కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.