27న ఆదిలాబాద్ లో ప్రమాణ స్వీకారం..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్, జులై 22 : రాజ్ గోండ్ సేవాసమితి (Raj Gond Seva Samiti) రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ పార్లమెంట్ సభ్యులు, తుడుం దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు సోయం బాపూరావు (Soyam Bapurao) ఎన్నికయ్యారు. ఈనెల 27న ఆదిలాబాద్ (Adilabad) లోని ఎస్టియు భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సోయం బాపూరావు తెలిపారు.
వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున గిరిజనులు తరలివస్తారని తెలిపారు. అదే రోజు రాష్ట్ర కార్యవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఆదిలాబాద్ జిల్లా రాజ్ గోండు సేవా సమితి అధ్యక్షునిగా బోత్ మండలం పట్నాపూర్ (Patnapur) గ్రామానికి చెందిన న్యాయవాది పంద్రం శంకర్ ను స్టీరింగ్ కమిటీ నియమించిందన్నారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో ఆదివాసుల హక్కులకు భంగం కలిగించే జీవో 49ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదివాసి చట్టాలు, హక్కులను కాపాడాలని కోరారు.

