Southindia Industry | సోషియా ఫాంటసీ.. సక్సెస్ ఇచ్చేనా..?

Southindia Industry | సోషియా ఫాంటసీ.. సక్సెస్ ఇచ్చేనా..?

Southindia Industry | సౌతిండియాలో సోషియో ఫాంటసీ ట్రెండ్ జోరు
కార్తికేయ నుంచి కల్కి వరకు – సక్సెస్ ఫార్ములా
మెగాస్టార్ ‘విశ్వంభర’పై భారీ అంచనాలు
రాజమౌళి ‘వారణాసి’ – మరో చరిత్ర సృష్టిస్తుందా?
జై హనుమాన్, కల్కి 2, గాడ్ ఆఫ్ వార్… లైన్లో భారీ ప్రాజెక్టులు
కోలీవుడ్‌లోనూ అదే జోనర్ జోరు
నార్త్ ఇండియా కూడా ఫాలో అవుతుందా?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకసారి లవ్ స్టోరీస్ ట్రెండ్ నడిస్తే.. మరోసారి యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఒక్క తెలుగులోనే కాకుండా సౌతిండియాలో సోషియో ఫాంటసీ ట్రెండ్ నడుస్తుంది. పురాణ ఇతిహాసాలు, జానపద గాధలకు సైన్స్ పిక్షన్ మిక్స్ చేయడాలు ట్రెండ్ గా మారింది. ఇలా చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో.. మరింత ఊపొచ్చింది. ఇంతకీ.. ఈమధ్య కాలంలో ఈ తరహాలో వచ్చిన సినిమాలు ఏంటి..? ఇదే జోనర్ లో రాబోతున్న సినిమాలు ఏంటి..?

Southindia Industry | యంగ్ స్టార్స్ నుంచి బడా స్టార్స్ వరకు..

Southindia Industry

కార్తికేయ, కార్తికేయ 2, హనుమాన్, మిరాయ్, కల్కి తదితర చిత్రాలు ఈ జోనర్ లో వచ్చిన సినిమాలే. ఈ సోషియో ఫాంటసీ జోనర్ లో వచ్చిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఈ తరహా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఈ తరహా కథలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ కూడా సోషియో ఫాంటసీ మూవీనే. మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతుండడం.. క్వాలిటీ బాగా రావాలని రీవర్క్ చేస్తుండడం కారణంగా లేట్ అవుతుంది. జులైలో ఈ భారీ చిత్రం థియేటర్స్ లోకి రానుందని సమాచారం.

Southindia Industry | దర్శకధీరుడు వారణాసి కూడా..

Southindia Industry

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా భారీ సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాతో చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబో మూవీ జై హనుమాన్, ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రాలు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ గా తెరకెక్కనున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఆ జోనర్ లోకే వస్తుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసిన నాగబంధం కూడా సోషియో ఫాంటసీనే. ఈ టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.

Southindia Industry | టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ కూడా..

Southindia Industry

ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఈ సోషియో ఫాంటసీ సినిమాలు వస్తున్నాయి. నయనతార మూకుత్తి అమ్మాన్ 2 మైథలాజికల్ టచ్ ఉన్న ఫిక్షన్ స్టోరీ. సూర్య కరుప్పు కూడా మైథలాజికల్ టచ్ ఉన్న సినిమానే. శివ కార్తికేయన్ అనౌన్స్ చేసిన సినిమా కూడా ఈ జోనర్ లో రూపొందే సినిమానే. వీఎఫ్ఎక్స్ తో రిస్క్ అని తెలిసినా కూడా ఆతరహా సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అలాగే మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ తరహా కథలతో సినిమాలు చేస్తున్నారు. మరి.. సౌతిండియా ట్రెండ్ ను నార్తిండియా కూడా ఫాలో అవుతుందేమో చూడాలి.

Leave a Reply