సౌందర్య లహరి

82. కరీంద్రాణాంశుండాన్కనకకదళీకాండపటలీం
ఉభాభ్యామూరుభ్యాముభయమపినిర్జిత్యభవతి
సువృత్తాభ్యాంపత్యుః ప్రణతి కఠినాభ్యాంగిరిసుతే
విధిజ్ఞేజానుభ్యాంవిబుధకరికుంభద్వయమపి.


తాత్పర్యం: ఓ వేదప్రతిపాదిత విధులను తెలిసి, ఆచరించే కొండలరాజకుమారీ! నున్నగాను, మెత్తగాను ఉన్న నీ రెండు తొడలతోనూ ఏనుగు తొండాలని, బంగారు అరటి బోదెలని జయించిన నీవు, భర్త అయిన పరమేశ్వరుడికి సాగిలపడి మ్రొక్కి నపుడు భూమిని తాకటం వల్ల గట్టి పడిన మోకాటిచిప్పల చేత దేవలోకంలో ఉన్న ఐరావత కుంభస్థలాలని కూడా గెలిచావు.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply