సౌందర్య లహరి

52. గతే కర్ణాభ్యర్ణంగరుత ఇవ పక్ష్మాణిదధతీ
పురాంభేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణఫలే
ఇమే నేత్రే గోత్రాధరపతికులోత్తంసకలికే
తవాకర్ణాకృష్టస్మరశరవిలాసంకలయతః.

తాత్పర్యం : భూమిని ధరించే పర్వతాలకి రాజైన హిమవంతుని వంశానికి సిగలో ధరించే పూవుమొగ్గ వలె అలంకారమై ఉన్న పార్వతీ దేవీ! రెండుప్రక్కల కట్టే గ్రద్దఈకల వలె ఉన్న రెప్పల వెంట్రుకలతో చెవుల వరకు సాగిన నీ కనురెప్పల తీరులో –త్రిపురహరుడైన శివుడి మనస్సులో ఉన్న శాంతమైన నిస్పృహని పోగొట్టి, మోహాన్ని కలిగించట మనే ప్రయోజనాన్ని సాధించటం కోసం ఆకర్ణాంతం లాగబడిన మన్మథుడి బాణాల సౌందర్యం గోచరిస్తోంది.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *