సౌందర్య లహరి

14. క్షితౌషట్పంచాశద్ద్విసమధికపంచాశదుదకే
హుతాశేద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే
దివి ద్విష్షట్త్రింశన్మనసిచ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగమ్.

తాత్పర్యం: అమ్మా! జగన్మాతా! భూతత్త్వానికి చెందిన మూలాధారచక్రము నందు 56,జలతత్త్వాత్మకమైనమణిపూరకచక్రమునందు 52,అగ్నితత్త్వానికి చెందిన స్వాధిష్ఠానచక్రము నందు 62,వాయుతత్త్వానికి చెందిన అనాహతపద్మమునందు 54,ఆకాశతత్త్వాత్మక మైన విశుద్ధిచక్రము నందు 72, మనస్తత్వ సంబంధ మైన ఆజ్ఞాచక్రము నందు 64 సంఖ్యలుగా ప్రకాశించే వెలుగుకిరణాలని అధిగమించి వాటి పైన నీ చరణకమలాలు ప్రకాశించు చున్నవి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *