భక్తులతో కిటకిటలాడిన సోమేశ్వరాలయం

భక్తులతో కిటకిటలాడిన సోమేశ్వరాలయం

నల్గొండ, నవంబర్ 5(ఆంధ్ర ప్రభ): కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పానగల్ లో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం (Someshwara Temple) లో గురువారం తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక అలంకరణలతో చిన్న పెద్ద తేడా లేకుండా యువతి యువకులు పాల్గొనడంతో సందడి మొదలైంది.

పురాతన దేవాలయం కావడంతో నల్లగొండ (Nalgonda) పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి దేవాలయంలో దీపారాధనలు శివునికి పాలభిషేకాలు చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకున్నారు.

Leave a Reply