వికారాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు లింగయ్య నాయక్, సుదీర్ ల తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రధానంగా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఓ జయసుధ డీఆర్డీఓ శ్రీనివాస్, డీఓ రేణుకాదేవి, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.