Software | పిలిస్తే నేరుగా పలికేవాళ్లం..
- ఆపద సమయాల్లో అండగా ఉండే వాళ్లం..
- గెలిపించండి… చెన్నారావుపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కంది శ్వేతకృష్ణచైతన్యరెడ్డి
Software | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంది శ్వేతకృష్ణ చైతన్యరెడ్డి(Swetha Krishna Chaitanya Reddy) ఇవాళ గ్రామంలో ప్రచారం ప్రారంభించారు. ఆమె గడపగడపకు తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… కొన్నేళ్లుగా తన భర్త కృష్ణ చైతన్య సాఫ్ట్ వేర్(Software) ఉద్యోగం చేసుకుంటూ తనకు వచ్చిన జీతంలోనే మండలంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాడని, కరోనా వంటి కష్టకాలంలో పేదలకు, ప్రజలకు బియ్యం, నూనెలు, నిత్యావసర వస్తువులు అందించాడని గుర్తు చేశారు.
పిలిస్తే నేరుగా పలికే వాళ్లమని.. ఆపద అని తెలిస్తే తమకు తోచిన సహాయం చేసే వాళ్లమని.. గ్రామ ప్రజలు ఆశీస్సులు అందించి గెలిపిస్తే చెన్నారావుపేట గ్రామాన్ని అన్ని అంశాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) ఆశీర్వాదంతో, మండల పార్టీ భాద్యులు, చెన్నారావుపేట బిఆర్ఎస్ నాయకుల సహకారంతో ప్రచారం విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
అధికారంలో ఉంటేనే అభివృద్ధి(Development) సాధ్యమనే వారి మాటలు నమ్మవద్దని…నిత్యం ప్రజల కోసం పని చేస్తున్న మాకు అండగా ఉండాలని ప్రజలను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కుండే మల్లయ్య, హంస విజయరామరాజు, గ్రామ ఎన్నికల ఇంచార్జి జున్నుతుల మహేందర్ రెడ్డి, నాయకులు ఎండి.రఫీ, నరేందర్,శ్రీధర్ రెడ్డి, సతీష్, రమేష్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

