సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం
శ్రీ సత్య సాయి బ్యూరో, సెప్టెంబర్ 04 (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి (Software Engineer) అదృశ్యమైనట్లు ఉద్యోగి భార్య కదిరి (Kadiri) పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన మేరకు కదిరి టౌన్, సింగనమల కాలనీకి చెందిన మొగల్ అఫ్సానా భర్త అమీర్ భాష గురించి ఫిర్యాదుచేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త హైదరాబాద్ (Hyderabad) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తాడని, ప్రతి శుక్రవారం రాత్రి అక్కడి నుండి బయలుదేరి కదిరికి వస్తాడని, ఈ క్రమంలో గత 29వ తేదీన తను హైదరాబాద్ నుండి పెనుగొండ దర్గా (Penukonda Dargah) కు బయలుదేరి వచ్చాడని తెలిపింది.
అక్కడి నుండి తనకి వీడియో కాల్ (video call) తో మాట్లాడిన తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతనికి గురించి వెతికినా అతని ఆచూకీ తెలియక పోవడంతో గురువారం కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ (Police Station) కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అఫ్సానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.