ఇన్ని చలాన్లేంది..?

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గణపతి నిమజ్జనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఖైరతాబాద్ హుస్సేన్ సాగ‌ర్ చేరుకుని ప్రజలతో కలిసి మాట్లాడారు. భక్తులతో కాసేపు సరదాగా గడిపారు. అయితే, సోష‌ల్ మీడియా కంటికి మ‌రో విష‌యం క‌న‌ప‌డింది.

పెండింగ్‌లో ఉన్న మూడు చలాన్లు :

2023 డిసెంబర్ 27 : కామారెడ్డి మల్లుపేట దర్గా దగ్గర ఓవర్‌ స్పీడ్ (108 km/hr, లిమిట్ 90) → రూ.1,035 ఫైన్
2023 డిసెంబర్ 30 : రాజేంద్రనగర్ టృఫ్శ్ పరిధిలో నో పార్కింగ్ → రూ.135 ఫైన్
2024 జనవరి 19 : వరంగల్ కల్లం క్రాస్ రోడ్ వద్ద ఓవర్‌ స్పీడ్ (110 km/hr లిమిట్ 80) → రూ.1,035 ఫైన్

వెంటనే అవి వైరల్ చేస్తూ “పాలకులకు ఒకలాగా, సామాన్యులకు మరోలాగా చట్టం అమలవుతుందా?” అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మూడు చలాన్ల మొత్తం రూ.2,205. సీఎం డిసెంబర్ 7, 2023న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే ఇవి నమోదయ్యాయి. నెటిజన్ల(netizens) ఉద్దేశం సీఎంను విమర్శించడం కాదు. చట్టం అందరికీ సమానంగా అమలుకావాలి అన్నదే వారి అభిప్రాయం.

సాధారణ ప్రజలు చలాన్లు చెల్లించక పోతే నోటీసులు(notices), వాహనాల సీజ్ వరకూ చేస్తారు. పాలనపై ప్రజలకు నమ్మకం ఏర్పడాలంటే నియమాలు అందరికీ ఒకే విధంగా వర్తించాలనేది వారి వాదన. అధికారులు ఈ విషయం సీఎం దృష్టికి(attention) తీసుకెళ్తే, ఆయన వెంటనే జరిమానాలు చెల్లించే అవకాశం ఉందని కూడా వారు సూచిస్తున్నారు.

Leave a Reply