Smuggling | మీట్ మాఫియా ఆగడం

Smuggling | మీట్ మాఫియా ఆగడం

  • కంటైనర్లలో మూగజీవుల స్మగ్లింగ్
  • 5 కంటైనరర్లను అడ్డుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
  • పోలీసులకు అప్పగింత

Smuggling | ఆంధ్రప్రభ, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : నంద్యాల జిల్లా జాతీయ రహదారి పక్కన ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో పశువులను అక్రమ రవాణా చేస్తున్న 5 భారీ కంటైనర్లు ను ఆదివారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఆ కంటైనర్ల లో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు , బర్రెలు ఉన్నాయి. సరైన పత్రాలు లేకుండా ఎద్దుల ను తరలిస్తున్నారని డీఎస్పీ కి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

Smuggling

కంటైనర్లు, లారీ ల ద్వారా ఎద్దులను బర్రెలను ఆవు లను తరలిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఒక్కొక్క కంటైనర్ లో 70 కి పైగా ఎద్దులు, బర్రెలను ను కుక్కి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా కొన్ని వందల జీవాలను అక్రమంగా తరలింపు పై పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ 5 భారీ కంటైనర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే అదే రహదారిలోనే మరో 10 కంటైనర్లు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతుండటం విశేషం.


తెలంగాణ నుండి కడప జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఇటువంటివి జరిగితే సహించమన్నారు. నోరులేని జీవులను అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న కంటైనర్లు ఎవరివి? ఎక్కడికి తరలిస్తునారో తప్పక బయటికి రావాలని, ఇంతటి వారిని పైన అయినా కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply