పశువులకు గాలికుంటు టీకాలు

కమ్మర్ పల్లి, అక్టోబర్ 27 ( ఆంధ్రప్రభ ): కమ్మర్ పల్లి (KammarPalli) మండలంలోని హాస కొత్తూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చౌట్ పల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్ (Dr.VasanthKumar) సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించుకోవాలనీ, అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు.

పశువులు (Cattle) రోగాల బారిన పడటం వల్ల నోటిలో ఫుల్లు,చొంగ కారడం, కాళ్ల డిక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం పశువుల అబార్షన్ల అవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని, కావున రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది సత్యం,ఆదర్శ సంఘం అధ్యక్షుడు పెద్ది మహిపాల్, క్రాంతి ,శ్రీనివాస్,మనోజ్, నరేందర్,అరుణ్,లింబద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply