అనారోగ్యంతో తహసీల్దార్‌ ప్రహ్లాద్‌ మృతి

రెవెన్యూ ఉద్యోగుల సంతాపం

సిర్పూర్‌ (యు), ఆంధ్రప్రభ : కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండల తహసీల్దార్‌గా పనిచేసిన రాథోడ్‌ ప్రహ్లాద్‌ (60) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందినట్లు రెవెన్యూ ఉద్యోగులు తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందారు.

అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మృతి చెందినట్లు ఉద్యోగులు తెలిపారు. మృతిచెందిన తహసీల్దార్‌ ప్రహ్లాద్‌ స్వగ్రామం గుడిహత్నూర్‌ మండలమని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల రెవెన్యూ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తహసీల్దార్‌ ప్రహ్లాద్‌ మృతి బాధాకరమని జైనూర్‌ తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, ఆర్‌ఐ మోహన్‌, ఇతర ఉద్యోగులు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.