Sirisha | గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి

Sirisha | గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి

Sirisha ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనకు ఒకసారి సర్పంచ్‌గా గెలిపించి గ్రామానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించాలని బుద్దేష్ పల్లె సర్పంచ్ అభ్యర్థి పెంట శిరీష మహిపాల్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ రోజు గ్రామంలోని వివిధ వార్డులలో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతినిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఒక్కసారి ప్రజలు దీవించి బ్యాట్ గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు.

Leave a Reply