12 స్థానాలు ఎగబాకిన మియా

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ (ICC Test rankings) లో సిరాజ్ తొలిసారిగా టాప్-15లో అడుగుపెట్టాడు. ఇంతకు ముందు అతని బెస్ట్ ర్యాంక్ 16. సిరాజ్ 12 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐదో టెస్టు (Fifth Test) లో సిరాజ్ సంచలన ప్రదర్శన నేపథ్యంలో తన ర్యాంకు భారీగా మెరుగు పర్చుకున్నాడు. ఆ టెస్టులో అతను 9 వికెట్లు తీసి, భారత్ విజయం (India win) లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

అలాగే, సిరీస్ మొత్తం కూడా అతను సత్తాచాటాడు. 23 వికెట్లు తీసి, సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఐదో టెస్టులో రాణించిన మరో బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కూడా తన ర్యాంక్ ను మెరుగు పర్చుకున్నాడు. 25 స్థానాలు వెనక్కినెట్టి 59వ స్థానంలో నిలిచాడు. ఇక, ఆఖరి టెస్టు కు దూరంగా ఉన్నప్పటికీ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) నం.1 బౌలర్ హోదాను కాపాడుకున్నాడు. జడేజా (jadeja) 3 స్థానాలు కోల్పోయి 17వ ర్యాంక్ కు పడిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 14 స్థానాలు ఎగబాకి 46వ స్థానానికి చేరుకున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్ (joe root) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తిరిగి టాప్ -5లో చోటు సంపాదించాడు. మూడు స్థానాలు అధిగమించి 5వ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఐదో టెస్టులో సెంచరీతో రాణించడంతో జైశ్వాల్ (Jaiswal) ర్యాంక్ మెరుగు పడింది. ఐదో టెస్టుకు గాయం కారణంగా దూరమైన పంత్ ఒక్క స్థానం కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. ఇక, కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubhman Gill) టాప్-10లో చోటు కోల్పోయాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా తన స్థానాన్ని కోల్పోయాడు. గిల్, రాహుల్ చెరో 4 స్థానాలు దిగజారి 13వ స్థానంలో, 40వ స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్ విభాగంలో జడేజా నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు.

Leave a Reply