ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్‌

నోటీసులు అందుకున్నవారు పూర్తి వివరాలతో సమాధానాలు ఇవ్వాలి: ఆడే కమల్‌సింగ్‌

కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని పెంచికల్‌పాడు గ్రామంలో ఎస్‌ఐఆర్‌ నోటీసులకు సంబంధించి సమాధానాలు, అవసరమైన పత్రాల స్వీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రియను తహసీల్దార్‌ ఆడే కమల్‌సింగ్‌ పరిశీలించారు.

నోటీసులు అందుకున్న వారి నుంచి సమాధానాలు, సంబంధిత పత్రాలను స్వీకరిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులు, ప్రతినిధులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బందికి సూచించారు.

నోటీసులు అందుకున్న ప్రజలకు అవసరమైన సమాచారం, తగిన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూర్తి వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలని ఆదేశించారు.

ప్రక్రియను వేగవంతంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన వివరాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌ రాకేష్‌, సర్పంచ్‌ కదం హిమ్మత్‌రావు పటేల్‌, ఉపసర్పంచ్‌ రాములు, ఆర్‌ఐ రాజేశ్వర్‌, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.