ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్‌

భూత్పూర్, ఆంధ్రప్రభ: మున్సిపాలిటీలో ఎస్‌ఐఆర్‌ నోటీసులకు సంబంధించి సమాధానాలు, అవసరమైన పత్రాల స్వీకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. బుధవారం అమిస్తాపూర్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఈ ప్రక్రియను మున్సిపల్‌ కమిషనర్‌ జె. పవన్‌కుమార్‌ పరిశీలించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి సమాధానాలు, సంబంధిత పత్రాలను స్వీకరిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులు, ప్రతినిధులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బందికి కమిషనర్‌ సూచించారు. నోటీసులు అందుకున్న ప్రజలకు అవసరమైన సమాచారం, తగిన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు.