ఎస్‌ఐఆర్ నోటీసులపై నిర్లక్ష్యం వద్దు
నోటీసులో తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు..
ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు
జైనూర్, ఆంధ్రప్రభ : ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న వారు ఎలాంటి జాప్యం చేయకుండా తహశీల్దార్ కార్యాలయంలో హాజరై తదుపరి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జైనూర్ తహశీల్దార్ అడా బీర్షావ్ సూచించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నోటీసులు అందుకున్న వారు అందులో పేర్కొన్న తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ముందుగానే కార్యాలయానికి హాజరై సంబంధిత ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
జాప్యం చేయడం వల్ల తదుపరి అధికారిక ప్రక్రియల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉందని తహశీల్దార్ పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ సంబంధిత బీఎల్‌ఓతో కలిసి నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి హాజరై అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.
