వైభవంగా అమ్మవారి వార్షిక పండుగ

వైభవంగా అమ్మవారి వార్షిక పండుగ
గ్రామాల నుంచితరలివచ్చిన వేలాది మంది భక్తులు
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్రసాద వితరణ.. అన్నదానం
సింహాచలం, ఆంధ్రప్రభ : సింహాద్రి నాథుడు సోదరి..అడవివరం శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి.. మరిడిమాంబ అమ్మవారి వార్షిక పండుగ శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.. ప్రతి ఏటా అమ్మవారి పుట్టినరోజుని పురస్కరించుకొని మార్చి 14 న నిర్వహించే వార్షిక పండుగను ఈ ఏడాది కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు.. తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు.
అనంతరం పలు గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కంట్ల శ్రీనుబాబు దంపతులు
అధ్యక్షులు పి వెంకటరావులు అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించారు.. ఈ సందర్భంగా భక్తులకి ప్రసాద వితరణ… భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని గావించారు… ఈ సందర్భంగా కార్పొరేటర్ కన్నా మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి వార్షిక పండగను అత్యంత వైభవంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.

ఆలయ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ… అందరి సహకారంతోనే అమ్మవారు ఆలయం అభివృద్ధి చేయగలి గామన్నారు.. సింహాద్రి నాధుడు సోదరిగా పోలిమేర దేవతగా విరాజిల్లుతున్న సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలు అన్నారు.. గ్రామ పొలిమేరలో కాపలాగా ఉండి దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడుతున్న అమ్మవారి ఆశీస్సులు అన్ని గ్రామాల ప్రజల పైన ఉండాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని తాము కోరుకున్నట్లు చెప్పారు..
ఆలయ కమిటీ సభ్యులు గంట్ల కనకరాజు బలిరెడ్డి శ్రీనివాస రావు.. పారిశ్రామికవేత్త బీవీ కృష్ణారెడ్డి.. స్థానికులు మహేష్.. తెలుగుదేశం పార్టీ నాయకులు దొంతల సంతోష్.. నవయుగ సేవా సంఘం అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.. పండుగ సందర్భంగా అమ్మవారితో పాటు ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
