Shri Paidamma | అమ్మవారి దర్శనం..
Shri Paidamma | పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారికి పెడన నియోజకవర్గం శాసనసభ్యులు (Legislators) కాగిత కృష్ణ ప్రసాద్, సతీమణి కాగిత శిరీష పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా పైడమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

