రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి
నిజాంపేట, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతాపై అవగాహన పెంచుకోవాలని రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్(CI Venkata Raja Goud) అన్నారు. ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణం వారోత్సవాలు సందర్భంగా ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటో డ్రైవర్ల(auto drivers)కు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించామన్నారు.
ఆటో డ్రైవర్లు తప్పకుండా లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్, కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ(Police Department) నియమాలను తప్పకుండ పాటించాలన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, రైటర్ రాజు, కానిస్టేబుల్ నవీన్, విజయ్, రమేష్, హరీష్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.