అందుకు.. సిద్ధంగా ఉండాలి..

అందుకు.. సిద్ధంగా ఉండాలి..

ఒంగోలు బ్యూరో : ఆంధ్రప్రభ : ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు(Collector Shri Rajababu), జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల్ క్రిష్ణతో కలసి ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మొంథా తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వివరాలను సంబంధిత శాఖల సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. అన్నీ శాఖలను సమన్వయం చేసుకుంటూ తుఫాను(Cyclone) పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కంట్రోల్ రూమ్(Control Room) సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన ఓబులేసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పిడి శ్రీమతి మాధురి, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply