టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు.. నిందితుల ఫొటోలు విడుదల!

సీసీటీవీ ఫుటేజీతో గుర్తింపు.. ముంబైలో పోలీసుల విస్తృత గాలింపు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో నిందితులుగా భావిస్తున్న ఇద్దరి ఫొటోలు బయటకు వచ్చాయి. తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. వారి కోసం ముంబైలో విస్తృతంగా గాలిస్తున్నారు.

జుహు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగిన ఈ కాల్పుల ఘటనలో టైగర్‌ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఆయన కారు డ్రైవర్‌, మరో ఆటో డ్రైవర్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. వారు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని అంధేరీ రైల్వే స్టేషన్‌ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం ముంబైకి చెందినదిగా భావిస్తున్నారు. మ‌రోవైపు, ఈ దాడికి తామే బాధ్యులమని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించినట్లు సమాచారం. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పనిచేసిన వారిని విడిచిపెట్టబోమంటూ ఆ ముఠాకు చెందిన అనిల్‌ పండిట్‌ ఓ పోస్టు చేశాడు. ఈ ఘటనతో ముంబైలో కలకలం రేగింది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.