టీమిండియాకు షాక్…

సొంతగడ్డపై ఆస్ట్రేలియతో ఆదివారం ఆరంభమైన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు నిరాశ ఎదురైంది. ఆతిథ్య భారత్‌పై ఆస్ట్రేలియా మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (64), స్మృతి మందాన (58) అర్ధశతకాలతో మెరిశారు. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (54) చక్కటి ఇన్నింగ్స్ ఆడినా, తర్వాతి బ్యాటర్లు ఆశించిన స్థాయిలో నిలవలేకపోయారు.

ఆ తర్వాత 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు రాణించారు. ఓపెనర్ ఫోబె లిచ్‌పీల్డ్ (88) వేగవంతమైన ఆరంభాన్ని అందించగా, బెత్ మూనీ (77 నాటౌట్), సదర్లాండ్ (54 నాటౌట్) అజేయంగా నిలిచి 44.1 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆధిక్యం సాధించగా, భారత్‌కు తప్పనిసరిగా రెండో వన్డేలో గెలిచి తిరిగి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply